మందు గ్లాస్ తో చిల్ అవుతూ.. జీవిత పాఠాలు చెబుతోన్న ప్రగతి.. పోస్ట్ వైరల్..!

-

సినీ ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో హీరోయిన్ గా అవకాశాలు అందుకొని.. ఆ తర్వాత సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకి స్థిరపడ్డ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రగతి ప్రస్తుతం తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మిగిలింది. ఇకపోతే ఇటీవల కాలంలో ప్రగతి సినిమాలకు కాస్త దూరంగా ఉందని చెప్పాలి. కరోనా వచ్చిన తర్వాత సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకున్న ఈమె జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తూ.. వర్క్ అవుట్ లు చేస్తూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అంతే కాదు బహిరంగంగా అభిమానులతో కలిసి తీన్మార్ స్టెప్పులేస్తూ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే వచ్చింది.

ఈ క్రమంలోనే గ్లామర్ ఫోటోషూట్లతో కూడా వరుసగా ప్రేక్షకులను అలరిస్తున్న ప్రగతి.. ఇప్పుడు సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో ఉంది. ఇకపోతే బుల్లితెర ప్రేక్షకులను కూడా తనదైన స్టైల్ లో సందడి చేస్తున్న ఈమె గురించి ఇప్పుడు కొన్ని ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఇకపోతే చేతిలో మందు గ్లాసు పట్టుకుని చిల్ అవుతూ ఉన్నటువంటి ఒక ఫోటోను షేర్ చేసింది ప్రగతి. ఈ ఫోటోని షేర్ చేస్తూ..” జీవితంలో ప్రయత్నించడం అనేది ఎప్పుడూ కూడా ఆపకూడదు.. ఆశతో జీవిస్తూ ఉంటే అన్నీ జరుగుతాయి. అలాగే జీవితంలో దేనిని కూడా వదులుకోకూడదు. ఈరోజు కోసం ప్రయత్నం చేయడం ఎంతో ముఖ్యమంటూ” చెప్పుకొచ్చింది ప్రగతి. అయితే ప్రగతి ఇలా చేతిలో మందు గ్లాసు పట్టుకొని జీవిత పాఠాలు చెబుతున్న.. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Read more RELATED
Recommended to you

Latest news