చిరంజీవి లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్.. ఎవరంటే!!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..‘స్వయం కృషి’తో అంచెలంచెలుగా ఇండస్ట్రీలో ఎదిగారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీకే పెద్ద దిక్కు అయ్యారు చిరు. తన కెరీర్ స్టార్ట్ అయిన నాటి నుంచి కష్టాన్ని నమ్ముకుని సినిమాలు చేసిన చిరంజీవి..ఇప్పటికే వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

మధ్యలో కొంత కాలం రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి.. ‘ఖైదీ నెం.150 ’ఫిల్మ్ తో రీ ఎంట్రీ ఇచ్చి.. సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇక ఆయన తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో పని చేశారు. సీనియర్ హీరోయిన్స్ రాధ, రాధిక, మాధవి, శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి ఎంతో మందితో పని చేశారు. సీనియర్ హీరోయిన్స్ మాత్రమే కాదు ఆ తర్వాత తరం వారు రంభ, రోజా, రమ్యకృష్ణ, విజయశాంతి, కాజల్ అగర్వాల్, త్రిష, నయనతార వంటి వారితో పని చేశారు. ఇక తనతో పని చేసిన హీరోయిన్స్ అందరూ కూడా చిరంజీవి బెస్ట్ కోస్టార్ అని చెప్తారు.

చిరంజీవి తన కెరీర్ లో ఇన్నాళ్ల పాటు దాదాపుగా నూట యాభైకి పైగా చిత్రాలు చేసినప్పటికీ ఒకే ఒక సినిమాలో హీరోయిన్ కు లిప్ లాక్ ఇవ్వడం గమనార్హం. అది కూడా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒత్తిడి వల్లనే జరిగిందట.

 

ఆ సీన్ కు మెగాస్టార్ నో చెప్పారట. కానీ, రాఘవేంద్రరావు పట్టుబట్టడంతో సీన్ లో భాగంగా సీనియర్ హీరోయిన్ నగ్మాకు లిప్ లాక్ ఇచ్చారు. అయితే, ఎడిటింగ్ లో తొలగించాలని పట్టుబడటంతో ఆ సీన్ ను తొలగించారట. చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news