ప్రతీ భారతీయుడు గర్వించే రోజు – చిరంజీవి

-

RRR సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్ వేడుకల్లో వేస్ట్ ఒరిజినల్ సాంగ్ గ RRR సినిమా లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. తెలుగు సినీ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఈ ఘనత సాధించిన మొదటి సినిమాగా RRR చిత్రం నిలిచిపోయింది. నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. ఎంతో ఉత్కంఠగా వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకుల చిరకాల కల నెరవేరింది.

తెలుగు సినిమా ఆస్కార్​ను ముద్దాడింది బాలీవుడ్ గడ్డపై తెలుగు సినిమా తన సత్తా చాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ దక్కించుకుంది. అయితే, ఈ విషయంపై చిరంజీవి స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా భారతీయులు గర్వించదగ్గర మూవీ.. ప్రతీ భారతీయుడు గర్వించే రోజు అని తెలిపారు చిరంజీవి. రాజమౌళి టీమ్‌కు నా అభినందనలు.. తెలుగు సినీ పరిశ్రమకు చరిత్రాత్మకమైన కీర్తిని తీసుకొచ్చారన్నారు. అవార్డులో రామ్‌చరణ్‌ పాత్ర కూడా ఉండడం సంతోషం అన్నారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news