చిరంజీవి సోషల్ మీడియాను ఎలా వాడుతున్నాడో, ఎలా ఆడుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. ఆయన వేసే ఒక్కో ట్వీట్‌కు అవతలి ప్రత్యర్థి చిత్తవుతున్నాడు. ఇప్పటికే ఆయన ట్వీట్ పోటుకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మోహన్ బాబు, పూరి జగన్నాధ్, రాజమౌళి వంటి వారు గురయ్యారు. ఎవ్వరినీ వదిలి పెట్టని చిరంజీవి చివరకు సొంత కొడుకు రామ్ చరణ్ పరువును కూడా తీసేశాడు.
రామ్ చరణ్.. నాన్నమ అంజనాదేవీ, అమ్మ సురేఖ దగ్గర వెన్న తయారు చేయడం నేర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వెన్న చిలుకుతున్న చెర్రీ వీడియో ఎంతగానే వైరల్ అయింది. అంతేకాకుండా రామ్ చరణ్ చేసిన కామెంట్ కూడా అంతే వైరల్ అయింది. అమ్మ, నాన్నమ్మలకు వెన్న రాయకముందే.. తాజా వెన్నను తయారుచేయడం నేర్చుకుంటున్నా అని కామెంట్ చేశాడు.
మై డియర్ బచ్చా …మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. How much ever you BUTTER, your position will not become BETTER. But … …అదే guarantee నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో ? https://t.co/x1AIBZR3lM
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 2, 2020
ఆ కామెంట్‌పై తాజాగా చిరు స్పందించాడు. మై డియర్ బచ్చా …మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్’ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. నువ్ ఎంత బట్టర్ పూసినా.. నీ స్థానంలో ఎలాంటి బెట్టర్ కాలేవురా.. అదే గ్యారంటీ మీ అమ్మ దగ్గర నాకు లేదనుకో.. అంటూ అమ్మకు కొడుకుకు మధ్య ఉన్న సంబంధం గురించి ఓ మంచి సెటైర్ వేశాడు.