ఆయన ప్రశంస ముందు ఆస్కార్ కూడా చిన్నదేనంటూ.. చిరంజీవి ఎమోషనల్ పోస్టు

-

‘RRR’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు వచ్చిందో తెలిసిందే. ఈ సినిమా ఇప్పటి వరకు పలు అంతర్జాతీయ పురస్కారాలు కూడా గెలుచుకుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. తాజాగా హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ స్పందిస్తూ, అద్భుతమని కొనియాడారు. ఈ సినిమాలో చరణ్ నటించిన రామరాజు పాత్ర ​గురించి ప్రస్తావించడంపై చిరు తెగ సంబరపడిపోయారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌ అద్భుత చిత్రం. తొలిసారి సినిమా చూసినప్పుడు ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా. సినిమాలోని పాత్రలు, వీఎఫ్‌ఎక్స్‌, కథను చెప్పిన విధానం అంతా షేక్‌స్పియర్‌ క్లాసిక్‌లా అనిపించింది. సినిమాకు సంబంధించి రామ్‌ పాత్ర చాలా ఛాలెంజింగ్‌. ఆ పాత్ర మైండ్‌లో ఏముంది? అని తెలిసిన తర్వాత నిజంగా గుండె బద్ధలైంది. ఇటీవల రాజమౌళిని స్వయంగా కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పా’’ అని ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కామెరూన్‌ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

దీనికి చిరంజీవి స్పందిస్తూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌ పాత్రను జేమ్స్‌ కామెరూన్‌ సర్‌ ప్రస్తావిస్తూ మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉంది. గ్లోబల్‌ ఐకాన్‌, సినిమాటిక్‌ జీనియస్‌ అయిన ఆయన అభిప్రాయం ముందు ఆస్కార్‌ కూడా చిన్నదే. రామ్‌చరణ్‌ ఇంత ఎత్తుకు ఎదిగాడా? అని ఒక తండ్రిగా నేను ఎంతో గర్వపడుతున్నా. కామెరూన్‌ అభినందనలే చరణ్‌కు దీవెనలు.. బంగారు భవిష్యత్‌కు మెట్లు’’ అని ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news