మహాశివరాత్రి వేడుకలకు గవర్నర్‌ తమిళిసై

-

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం ఘనంగా జరుగుతోంది. ఏ శివాలయం చూసిన భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు చేసేందుకు ఆలయాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. శుక్రవారం రోజు నుంచే చాలా మంది భక్తులు ఆలయాలకు తరలి వెళ్తున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఉండేందుకు ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతీ క్షేత్రం, ఏడుపాయల వనరుద్గా భవాని మాత ఆలయం, మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట, జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి, కోటగుళ్లు, ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాల్లో భక్తులు కిటకిట లాడుతున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే.. హన్మకొండ జిల్లా రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఇవాళ ఓరుగల్లులో పర్యటించనున్నారు. మహాశివరాత్రి సందర్బంగా హనుమకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నారు. హైగ్రివాచారి గ్రౌండ్ లో ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి మహోత్సవాల్లో గవర్నర్ తమిళి సై తోపాటు అవధాని మాడుగుల నాగఫణిశర్మ, సినీ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొననున్నారు. శివరాత్రి జాగారం ఉండే భక్తుల కోసం ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news