అల్లు స్టూడియోకు లాభాలను తీసుకురావాలి – చిరంజీవి

అల్లు స్టూడియో లాభాలను తీసుకురావాలన్నారు చిరంజీవి. అల్లు స్టూడియో ఓపెనింగ్‌ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా వారికి నా నివాళి అని.. ఎంతో మంది నటులున్నా కొద్దిమందికి మాత్రమే ఘనత, అప్యాయత లభిస్తుందన్నారు.

రామలింగయ్య గారి బాటలో అరవింద్, బన్నీ శిరీష్ ,బాబి విజయవంతంగా కొనసాగుతున్నారు..నాడు నటుడిగా ఎదగాలని రామలింగయ్య గారి ఆలోచనే నేడు ఓ వ్యవస్ద గా అల్లు కుటుంబం ఎదిగిందని వెల్లడించారు.

అరవింద్ అగ్ర నిర్మాతగా , మనవలకు స్టార్డమ్ దక్కింది..అల్లు స్టూడియో లాభాలను తీసుకురావాలని కోరారు. ఇదోక అల్లు వారికి కృతజ్ఞత , గుర్తింపు గా ఉండాలని నిర్మించినట్లుంది.. అల్లు ఫ్యామిలీ లో భాగం అవ్వటం నాకు ఆనందంగా వుందని తెలిపారు. ముంబై లో సల్మాన్ తో గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ కు వెళ్లుతున్నాను.. సాయంత్రం అల్లు రామలింగయ్య గారి శతజయంతి సభలో మాట్లాడతానని చెప్పారు చిరంజీవి.