ఆంధ్రా చార్లీ చాప్లిన్ మాదిరి నవ్వించే ఆ సినిమా కారణంగానే చిరుకు ఎంతో పేరు వచ్చింది. కామిడీ పండించడంలో చిరుకు చిరు మాత్రమే సాటి. మరి ! బన్నీ ఆ విధంగా ఆయనకు పోటీ ఇవ్వగలడా లేదా అన్నది ఓ సందేహం. ఆ వివరం ఈ కథనంలో…మొదట్నుంచి ఆసక్తి రేపిన ప్రాజెక్టులో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆ విధంగా మెగా మల్టీ స్టారర్ మన ముందుకు వచ్చేస్తుంది.
వాస్తవానికి మల్టీస్టారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే..ప్రేక్షకుల ముందుకు వచ్చిన అన్ని సినిమాలూ భారీ హిట్ ను అందుకోకపోయినప్పటికీ ఆ క్రేజ్ మాత్రం ఎన్నటికీ తగ్గదు. ఇదే సమయంలో ఇదే క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ వాల్యూను పెంచుకునేందుకు మరో హీరో తో స్క్రీన్ ను షేర్ చేసుకునేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులను బ్రేక్ చేసింది..ఈ సినిమా లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించారు.ఇప్పుడు మెగా హీరోలు చేసిన మల్టీస్టారర్ సినిమా ఆచార్య..ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే నిర్వహించారు. ఇక సినిమా రిలీజ్ కి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది.కాగా, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పలు మీడియా ఛానెల్స్ కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆచార్య సినిమాలో వేసిన ధర్మస్థలి సెట్ లో డైరెక్టర్ హరీశ్ శంకర్ తో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి, చరణ్, కొరటాల శివ పాల్గొనగా, హరీశ్ శంకర్ అడిగిన పలు ప్రశ్నలకి ఆసక్తికర విషయాలను తెలిపారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ హరీశ్ ఒక ప్రశ్న అడిగారు.. చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమాని ఈ జనరేషన్ వాళ్ళు ఎవరు తీస్తే బాగుంటుంది, ఆ రోల్ లో ఎవరిని చూడాలి అనుకుంటున్నారు.. అని అడగగా దానికి సమాధానంగా చిరంజీవి..నాకు తెలిసి చంటబ్బాయి సినిమా ఈ జనరేషన్ లో బన్నీ చేయగలడు. బన్నీ బేసిక్ గా మిమిక్ కూడా. అన్ని కామెడీ వాయిస్ లు బాగా చేస్తాడు. మిమిక్రీతో నవ్విస్తాడు కూడా అని బన్నీ సీక్రెట్స్ ను చిరు బయట పెట్టారు.. ఆ విషయం విన్న బన్నీ ఫ్యాన్స్ ఆనందాలకు అవధులే లేవు. ఈ క్రేజీ ప్రాజెక్టు బన్నీ చేస్తాడా ?