మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ గా సీఎం జగన్ పథకం..!

-

సాధారణంగా అటు మహేష్ బాబుకు , ఇటు సీఎం జగన్ కి కలిపి కామన్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగానే ఉన్నారు. మహేష్ బాబుని జగన్ గా ఊహించుకుంటూ ఉంటారు.. ఇకపోతే జగన్ పథకాన్ని మహేష్ తన సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు కుటుంబం వైసీపీ పార్టీతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంది . సూపర్ స్టార్ కృష్ణకు వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం .. ఇప్పుడు మహేష్ బాబు కూడా జగన్ అంటే అభిమానం చూపిస్తూ ఉంటారు.

వైసీపీలో కూడా మహేష్ బాబుకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఇకపోతే బ్యానర్లు కట్టాల్సి వచ్చినప్పుడు ఓకే బ్యానర్ లో జగన్ మహేష్ బాబు ఫోటోలు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. భరత్ అనే నేను సినిమాలో మహేష్ కూడా సీఎం జగన్ రియల్ క్యారెక్టర్ పోలిక పెట్టుకుని నటించడం జరిగింది ఇది చూసి అభిమానుల సైతం సంబరపడిపోయారు.. ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 28 అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కోసం జగన్ పథకం పేరును టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

అసలే త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అ అనే సెంటిమెంట్ ఎక్కువ తన సినిమాలకి ఎక్కువగా అ అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్సే ఉంటాయి.. ఈ క్రమంలోని జగన్ పై తన అభిమానాన్ని చాటుకుంటూ.. త్రివిక్రమ్ సెంటిమెంటుని ఫాలో అవుతూ “అమ్మఒడి” అనే టైటిల్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని.. ఈ పేరే ఖాయం చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఉగాది సందర్భంగా ఈ టైటిల్ ను రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడైతే ఈ వార్త బాగా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news