చిరు సినిమాకు కరోనా దెబ్బ…!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ని ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి కూడా దీనిపై ఒక కార్యక్రమంలో ప్రకటన కూడా చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న ప్రచారం మెగా అభిమానులు ఆందోళనకు గురి చేస్తోందని చెప్పాలి. ఈ సినిమాను కరోనదెబ్బకు కొంతకాలం వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు.

వాస్తవానికి ఈ సినిమాలో విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉంటుందట.ఇప్పటికే విదేశాల్లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను చిత్రీకరించారు. అందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.ఇప్పుడు కరోనా దెబ్బకు విదేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సినిమాలో కొన్ని సీన్లు కొంతకాలం పాటు వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే విధంగా షెడ్యూల్ షెడ్యూల్ ని ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వాటిని ఇక్కడే ఉత్తరాది రాష్ట్రాల్లో చిత్రీకరించే ప్లాన్ కూడా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు ఈ సినిమా విడుదలవుతోంది అనేది మాత్రం స్పష్టత లేదు. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి కి సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఈ లుక్ లో చిరంజీవి మావోయిస్టు గా కనబడుతున్నారు. కాగా ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది కానుకగా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news