సలార్ 2 నుంచి క్రేజీ లీక్స్.. క్లిప్స్ వైరల్..!

-

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా సలార్ 2 వస్తున్న విషయం విధితమే. ఇటీవలే సలార్ 2 ప్రాజెక్ట్ రద్దు అయిందని కూడా కొన్ని రూమర్స్ వినిపించాయి. ఈ రూమర్లపై సలార్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. సెట్స్ లో ప్రభాస్-ప్రశాంత్ నీల్ నవ్వుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సలార్ 2 ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని స్పష్టంగా అర్థమైంది.

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. దీంతో శౌర్యాంగ పర్వం పేరుతో రూపొందనున్న పార్ట్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం షూటింగ్ కొంత మేరకు ఎప్పుడో ప్రశాంత్ నీల్ పూర్తి చేశాడు. షూటింగ్ ఇంకా పూర్తి చేయాల్సి ఉండగా.. ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ లీక్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. సలార్ 2లో టన్నెల్ ఫైట్స్ సీక్వెన్స్ అంటే కొన్ని క్లిప్స్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. సలార్ పార్ట్ 1లో కాటేరమ్మ ఫైట్ కంటే ఇంది వైలెంట్ గా ఉంటుందని టాక్ స్ప్రెడ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version