ఆ పని చేస్తే ఉద్యోగులందరికీ KGF2 టికెట్స్ ఫ్రీ..కంపెనీ వినూత్న ప్రకటన

-

కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తుండగా, ఈ నెల 14న సినిమా విడుదలైంది. చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. దాంతో సరికొత్త రికార్డులను ఈ పిక్చర్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా టికెట్స్ దొరకడం లేదు. దాంతో ఉద్యోగులందరికీ KGF2 టికెట్స్ ఫ్రీగా ఇస్తామని ఓ కంపెనీ వినూత్న ప్రకటన చేసింది. ఇందుకుగాను వారి ఓ పని చేయాలని యాడ్ లో పేర్కొంది సదరు కంపెనీ యాజమాన్యం.

ఆ కంపెనీ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. మీమీ చాట్ అనే కంపెనీ ఈ ప్రకటనను ఈ నెల 15న చేసింది. సబ్జెక్ట్ KGF2 అనే టైటిల్ తో ప్రకటనలో తమ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చేసింది.

ఎవరైనా తమ కంపెనీ మీమ్ చాట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఉద్యోగులు కాని లేదా ఇన్ టర్న్స్ కాని లేదా న్యూ యూజర్స్ కాని ‘మీమ్ చాట్ యాప్ ’ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నట్లయితే KGF2 మూవీ టికెట్స్ ఫ్రీగా ఇస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు యాప్ లోనే క్లియర్ గా మెన్షన్ చేసినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.

ఇక ఈ యాడ్ చూసి సినీ అభిమానులు వావ్ అంటున్నారు. సౌత్ ఇండియాన్ మూవీస్ అటువంటి క్రేజ్ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. KGF2 మూవీ పోస్టర్స్ చేస్తున్నారు. రాఖీ భాయ్ సందడి మామూలుగా ఉండదు మరి అని అంటున్నారు. ఈ మేరకు వారు ట్వి్ట్టర్ లో ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ చిత్రం రికార్డుల పర్వం కొనసాగిస్తోంది. బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతూ ముందుకు సాగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news