క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘దళపతి’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. కాగా, ఆ చిత్రంలో రజనీకాంత్ తో కలిసి నటించిన స్టైలిష్ హీరో అరవింద్ స్వామి ఇప్పుడు మళ్లీ రజనీకాంత్ తో కలిసి నటించబోతున్నారని వార్తలొస్తున్నాయి.
‘దళపతి’ వచ్చి 31 ఏళ్లు దాటింది. ఇన్నేళ్ల తర్వాత సూపర్ స్టార్ తో అరవింద్ స్వామి నటించినున్నారని తెలుసుకుని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘జైలర్’ తర్వాత వచ్చే చిత్రంలో అరవింద్ స్వామి విలన్ గా కనిపించనున్నారని టాక్. ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రజనీ ‘జైలర్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రజనీ చేసే ‘తలైవర్-170’ ఫిల్మ్ లో అరవింద్ స్వామి నటిస్తున్నారని టాక్.
లైకా ప్రొడక్షన్స్ ఈ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయబోతుండగా, ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నారని టాక్. అయితే, ఈ విషయమై ఇంకా ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రేక్షకులకు చివరగా ‘పెద్దన్న’ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు.
నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వస్తున్న ‘జైలర్’లో రమ్యకృష్ణ, జై, తమన్నా, యోగిబాబు నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన స్టైలిష్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డెఫినెట్ గా ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.