టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టార్గెట్ మిస్ ఫైర్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. ఈ నేపథ్యంలో తాజాగా ‘లైగర్’ సినిమా నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన చార్మి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.
‘లైగర్’ ఎఫెక్ట్ తో చార్మి షాకింగ్ డెసిషన్ తీసుకున్నదని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చార్మి తెలిపారు. ‘పూరీ కనెక్ట్స్’ భవిష్యత్తులో మరింత బలంగా, ఉన్నతంగా సిద్ధమై మళ్లీ తిరిగి వస్తుందని, అప్పటి వరకు ప్రశాంతంగా జీవించండి, జీవించనివ్వండని ట్వీట్ లో పేర్కొన్నారు చార్మి. సదరు ట్వీట్ ప్రజెంట్ వైరలవుతోంది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ మిస్ ఫైర్ అయిన నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చార్మి డిసైడ్ అయ్యారని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యాపాండే ఇందులో హీరోయిన్ కాగా, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరించిన ఈ పిక్చర్ మేకింగ్ కు రూ.వంద కోట్లు అయినట్లు తెలుస్తోంది.
పూరీ జగన్నాత్ తన నెక్ట్స్ ఫిల్మ్, డీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన(జేజీఎం)’ ను కూడా విజయ్ దేవరకొండతోనే చేస్తున్న సంగతి అందరికీ విదితమే. ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.