దాస్ కా ధమ్కీ: మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన విశ్వక్..!

-

యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించి..నటించారు. నివేదా పేతురాజు, అజయ్, రావు రమేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఉగాది పర్వదినాన మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇకపోతే మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఆయన సినీ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి.

ముందుగా ఈ సినిమాకు నిర్మాత కరాటే రాజు అనుకున్నప్పటికీ బడ్జెట్ కంటే మూడు రెట్లు పెరగడమే కాకుండా పని రోజులు కూడా బాగా పెరిగాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా బడ్జెట్ రూ. 20 కోట్లుగా అంచనా వేశారు. దాంతో భారీ బడ్జెట్ చిత్రం జాబితాలోకి ఈ సినిమా చేరిపోయింది. దాస్ కా ధమ్ కీ బడ్జెట్ పరంగానే కాకుండా బిజినెస్ పరంగా కూడా భారీ రేంజ్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఈ సినిమా ఫ్రీ రిలీస్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో రూ.3 కోట్లు, సీడెడ్ లో రూ.1 కోటి, ఆంధ్రాలో రూ.3 కోట్లుగా అంచనా వేశారు. దీంతో దాదాపు రూ.7 కోట్ల మేర రెండు తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ హక్కులకు అమ్ముడుపోయినట్లు సమాచారం.

ఇక ఇతర రాష్ట్రాల హక్కుల విలువ రూ. 80 లక్షలు గా, ఓవర్సీస్ ఇతర అంశాలు కలుపుకొని మొత్తం రూ.10 కోట్లుగా ఈ సినిమా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.ఇక ఓవర్సీస్ లో కలిపి మొత్తంగా 650 స్క్రీన్ లలో రిలీజ్ అయింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలో 40% ఆకు పెన్సితో కనిపించింది . ఉదయం షోలకు స్లోగా ఉన్న మధ్యాహ్నం, ఫస్ట్ షోలకు మంచి డిమాండ్ పెరిగింది.. మొదటి రోజు రూ.3 కోట్ల షేర్, రూ.6 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news