Dhamaka : ధమాకా నుంచి బిగ్ అప్డేట్..రవితేజ ఫ్యాన్స్ కు ఇక పండగే

-

మాస్‌ మహారాజు రవితేజ వరుసగా సినిమాలు లైన్‌ లో పెట్టారు. ఖిలాడీ, రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాలు పెద్దగా హిట్టు కాకపోయినా.. ఎక్కడా తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నాడు రవితేజ. ఈ నేపథ్యంలోనే.. ఇప్పుడు ధమాకా, రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు రవితేజ.


అయితే.. రవితేజ.. తన మాస్‌ యాంగిల్‌ చూపించేందుకు ధమాకా సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. బీమ్స్‌ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా… కార్తీక్‌ ఘట్టమనేని కెమెరామెన్‌ గా వ్యవహరించనున్నారు.

ఇది ఇలా ఉండగా.. తాజాగా థమాకా సినిమా నుంచి.. అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ ను రేపు వినాయక చవిత సందర్భంగా సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ అప్డేట్ తో రవితేజ ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news