మూవీ లవర్స్​కు ఆదిపురుష్ టీమ్ బంపర్ ఆఫర్

-

సినిమా లవర్స్​కు ‘ఆదిపురుష్‌’ మూవీ టీమ్​ గుడ్​ న్యూస్ చెప్పింది. ఈ చిత్రాన్ని చూసేందుకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆదిపురుష్ సినిమాకు ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీగా పొందే అవకాశాన్ని కల్పించింది. ‘పేటీఎం’ ద్వారా ఇలా రెండు టికెట్ల ఆఫర్​ పొందొచ్చని సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. అయితే, దీనికి కొన్ని కండిషన్స్​ వర్తిస్తాయని వెల్లడించింది పేటీఎం. ఈ ఆఫర్‌ జూన్‌ 30 వరకే ఉంటుందని తెలిపింది.

ముందుగా రూ.100 చెల్లిస్తే ప్రోమో కోడ్‌ వస్తుందని, టికెట్‌ బుక్‌ చేసుకునే ముందు దాన్ని అప్లై చేస్తే రూ. 400 వరకు క్యాష్‌బ్యాక్‌ వస్తుందని పేర్కొంది. కనీసం రూ. 350 ధర ఉన్న టికెట్‌కే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని చెప్పుకొచ్చింది. అంటే.. రెండు టికెట్లు బుక్‌ చేయాల్సి వస్తే ట్యాక్స్‌తో కలిపి రూ.700కిపైగానే ఖర్చు అవుతుంది. అదే పేటీఎం ఆఫర్‌ కోడ్‌ను వినియోగిస్తే సగానికి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ బంపర్ ఆఫర్​ను క్యాష్ చేస్కోండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news