డైలాగ్ ఆఫ్ ద డే : చెత్తంతా వాగ‌కండి.. సినిమా.. సినిమా

-

మాట‌ల కార‌ణంగానే యుద్ధాలు నడుస్తున్నాయి. మాట‌లు కార‌ణంగానే రావాల్సిన గుర్తింపు రాకుండా పోతుంది. జ‌గ‌న్ మ‌రియు చిరు బృందాల మ‌ధ్య సానుకూలం అయిన మాట‌లు న‌డిచాయి క‌నుక ఇక చెత్త వాగుడు మాట్లాడ‌డం ఇండ‌స్ట్రీవ్య‌క్తులు చేయ‌డం ఆపితే ఇంకొన్ని మంచి ఫ‌లితాలే వ‌స్తాయి. ఏది ప‌డితే అది మాట్లాడ‌కుండా ఉంటే ఇంకా మంచి జ‌రుగుతుంది ఇండ‌స్ట్రీకి. ఎలానూ విశాఖ‌కు ఇండ‌స్ట్రీ వ‌స్తే బాగుంటుంది అనుకుంటున్నారు క‌నుక ఇదే విధంగా కొన్ని రోజులు సత్సంబంధాలు కొన‌సాగితే రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో క‌మ్మ నిర్మాత‌లు ఇంకాస్త నిల‌దొక్కుకోవ‌డం ఖాయం. కనుక చెత్త వాగ‌కండి చెత్త తీయకండి..

సినిమా ఎలా అయినా తీయండి కానీ మంచే చెప్పండి.. హింస‌నూ ఉన్మాదాన్నీ త‌గ్గించే ప‌నులే చేయండి. ఇవ‌న్నీ రాసేందుకు బాగుంటాయి కానీ తీసేందుకు బాగోవు అని అంటారు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు. స‌రే! ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా నిన్న‌టి వేళ జ‌గ‌న్ ను చిరు క‌లిశారు. చిరుతో పాటు ఇంకొంద‌రు కూడా క‌లిశారు. యువ హీరోలు ప్ర‌భాస్, మ‌హేశ్ వ‌చ్చి త‌మ విన్నపాలు చెప్పారు. ద‌ర్శ‌కులు రాజ‌మౌళి కూడా సినిమా క‌ష్టాలు కొన్ని ఏక‌రువు పెట్టారు. కొర‌టాల శివ మాత్రం చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు మాట్లాడ‌లేదు అని మంత్రి పేర్ని నాని ధ్రువీక‌రించారు.

ఇక సినిమా విష‌య‌మై ఇవాళ కొంత చ‌ర్చ నడుస్తోంది. ఖ‌ర్చుకు సంబంధించి వ‌స్తున్న గొడ‌వ ఇది. బ‌డ్జెట్ ను నియంత్రించ‌కుండా చెత్తంతా నెత్తిమీద పోస్తున్నారు అన్న‌ది ఓ వాద‌న. అంతేకాదు రెండు శాతం స‌క్సెస్ రేటును పెంచే ప్ర‌య‌త్నాలేవీ చేయ‌కుండా టికెట్ రేట్ చుట్టూనే ఇష్యూ న‌డ‌ప‌డం కూడా ఏం బాలేద‌న్న మాట వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో థియేట‌ర్ రిలీజ్ క‌న్నా ఓటీటీ కంటెంట్ బెట‌ర్ వే లో ఉంది అన్న టాక్ కూడా వ‌స్తోంది. ఈ విధంగా చాలా ఉన్నాయి. చాలా న‌డిచాయి కూడా! న‌డుస్తున్నాయి కూడా!

ముఖ్యంగా సినిమా కోసం చిరు మాట్లాడి కొంత వివాదాన్ని ర‌ద్దు చేశారు. కొంత వివాదాన్ని మిగిలి ఉంచారు. ఇదే స‌మ‌యంలో ఇండ‌స్ట్రీని విశాఖ‌కు తీసుకువ‌చ్చే ప్లాన్ ఒక‌టి చేస్తున్నారు. అందుకు అల్లు అర‌వింద్ కూడా సుముఖంగానే ఉన్నారు. క‌నుక ఇండ‌స్ట్రీ ఇక్క‌డికి వ‌స్తే న‌లుగురికి కాదు 400 మందికి ప‌ని దొరుకుతుంది. అదేవిధంగా వైసీపీ ఆశిస్తున్న విధంగా రియ‌ల్ బూమ్ కూడా పెరుగుతోంది. ఆ విధంగా చూసుకున్నా రెండు వ‌ర్గాల‌కూ మేలే. క‌నుక చెత్త తీయ‌కుండా చెత్త వాగ‌కుండా ఇండ‌స్ట్రీ మ‌నుషులు ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా బ‌తుకుతుంది. బ‌తికాక మంచి ఫ‌లితాలు రావ‌డం అన్న‌ది సాధ్యం కూడా!

Read more RELATED
Recommended to you

Latest news