ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్ యుక్త వయసులో ఏం చేశారనే కల్పిత కథాంశంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరణ్ సరసన బాలీవుడ్ కథానాయిక అలియాభట్ ఎంపికైంది. ఎన్టీఆర్ సరసన ఎంపికైన బ్రిటీష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ మధ్యలోనే తప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆయన సరసన నటించే కథానాయిక కోసం అన్వేషణ సాగుతుంది. చిత్ర బృందం గత కొన్నిరోజులుగా మరో అమ్మడిని పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు.
కానీ ఇప్పటి వరకు ఎవరూ దొరకలేదనే సమాచారం వినిపిస్తుంది. బాలీవుడ్ హీరోయిన్లు పరిణీతి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేర్లు వినిపించాయి. జాక్వెలిన్ పేరుని ఏకంగా బాలీవుడ్ కండ వీరుడు సల్మాన్ రాజమౌళికి సూచించారట. ఆ మధ్య ఈ వార్త వైరల్ అయ్యింది. దీనిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. మరోవైపు ఇందులో ఎన్టీఆర్ సరసన ఇద్దరు కథానాయికలకు చోటుందని వినిపించింది. ఒక్క హీరోయిన్‌ని పట్టుకోవడానికే రాజమౌళి బృందం నానా తంటాలు పడుతుంటే, ఇద్దరిని ఎంపిక చేయడం పెద్ద సవాల్ అనే చెప్పొచ్చు. మరి ఈ కథానాయిక వార్తలకు యూనిట్ ఎప్పుడు తెరదించుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ఇందులో కీలక పాత్రల్లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మరో కీలక పాత్రకు నిత్యా మీనన్ ఎంపికైనట్టు తెలిసింది. దీంతోపాటు అనుష్క కూడా ఓ ముఖ్య పాత్రలో మెరవనున్నట్టు ఇటీవ సోషల్ మీడియాలో పలు వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఇందులో అనుష్క నటించడం లేదని తెలిసింది. ఒక్క మాటలో చెప్పాలనంటే ఈ సినిమాకి అనుష్క నో చెప్పిందని టాక్. ప్రస్తుతం అనుష్క ‘సైలెన్స్’ అనే సినిమాలో నటిస్తుంది. దీనికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ‘ఆర్ ఆర్ ఆర్’ ఇటీవల రామ్‌చరణ్ గాయం కారణంగా వాయిదా పడిరది. ఆయన కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనే టైమ్‌లోనే ఎన్టీఆర్‌కి కుడి చేయి మడమకి గాయమైంది. అయినా గాయాన్ని లెక్క చేయకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారట. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే పలు కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య డీవీవీ దాదాపు రూ.300కోట్ల నుంచి రూ.400కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.