రూ.80 కోట్లు మీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా.. తమ్మారెడ్డిపై నాగబాబు కౌంటర్..!

-

ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెళ్ళు వెత్తుతుంటే.. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం ఘాటైన విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. ఇప్పుడు వచ్చే ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ యూనిట్ రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే మేము ఆ డబ్బుతో ఎనిమిది సినిమాలు తీసి మీ ముఖాలు కొడతాము.. వారు విమాన టికెట్స్ కోసమే అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు.. అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు.

తన ట్విట్టర్ వేదికగా నాగబాబు.. “ఎవరికి వారే ఇలా అనుకుంటున్నారు.. నీ అమ్మ మొగుడు ఖర్చు పెడతారా రూ.80 కోట్లు.. ఆర్ ఆర్ ఆర్ కి ఆస్కార్ కోసం.. (#RRR మీద కామెంట్ కు వైసీపీ వారి భాషలో సమాధానం)” అంటూ రాసుకు వచ్చాడు నాగబాబు .ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది ఇక నాగబాబు కౌంటర్ ను కొంతమంది నెటిజనులు సమర్ధిస్తూ కామెంట్ చేస్తుంటే.. ఇలాంటి వారికి ఇలాంటి భాషలోనే బుద్ధి చెప్పాలని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై తమ్మారెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి..

ఇక ఆస్కార్ అవార్డ్స్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా సినిమా విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఆస్కార్ అవార్డు ఇస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మార్చి 12వ తేదీన ఘనంగా జరుపబోతున్నారు. మరి ఈసారి ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చేటట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news