ఇద్దరి మధ్య గొడవ ముదిరిందా..?

-

రంగస్థలం తర్వాత రాం చరణ్ చేస్తున్న బోయపాటి శ్రీను సినిమా సెట్స్ మీద ఉంది. మొదటి నుండి ఈ సినిమా గురించి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. చరణ్ రాకుండానే మొదటి షెడ్యూల్ పూర్తి చేశాడని అప్పట్లో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా అనుకున్న విధంగా షూటింగ్ జరుపలేకపోతున్నాడట బోయపాటి శ్రీను. భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సింగిల్ డే షూటింగ్ ఖర్చు 25 లక్షలు వస్తుందట.

అయితే అంత ఖర్చు పెడుతున్నా అనుకున్న విధంగా షెడ్యూల్ జరగట్లేదని టాక్. ఈ విషయంపై చరణ్ బోయపాటితో గొడవ పడ్డాడట. ఓ పక్క నిర్మాత డివివి దానయ్య కూడా బోయపాటి ప్రవర్తన వల్ల ఇబ్బంది పడుతున్నాడట. సినిమాలో హీరో, నిర్మాత దర్శకుడి వల్ల డిస్ట్రబ్ అవడం చాలా రేర్. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది.

ఇక దానయ్యతో ఈ సినిమాతో పాటుగా రాం చరణ్, రాజమౌళి మల్టీస్టారర్ సినిమా కూడా చేస్తున్నాడు. బోయపాటి సినిమా పూర్తి కాగానే ఆ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారట. బోయపాటి శ్రీను సినిమాలో చరణ్ తో భరత్ హీరోయిన్ కియరా అద్వాని నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news