దిల్ రాజు ప్రొడక్షన్‌ లో రౌడీ హీరో సినిమా !

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టార్గెట్ మిస్ ఫైర్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. దీంతో రౌడీ హీరో విజయ్‌ డీలా పడ్డాడు.

లైగర్‌ దెబ్బకు జనగనమన కూడా ఆగిపోయిందట. ఇక ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఖుషీ’ మూవీ పైనే ఉన్నాయి. అయితే ఇప్పుడు లైగర్ దెబ్బకు రౌడీకి మంచి హిట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట దిల్ రాజు. ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ డైరెక్టర్‌తో హరీష్ శంకర్‌తో విజయ్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం పవన్‌తో భవధీయుడు భగత్ సింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు హరీష్. ఈ లోపు విజయ్‌తో సినిమా చేసేలా రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news