దుల్కర్​ ‘సీతారామం’.. రష్మికనే టర్నింగ్​ పాయింట్

-

‘సీతారామం’ చిత్రంలో రష్మికది చాలా కీలకమైన పాత్ర అని, అదే కథని మలుపు తిప్పుతుందని అన్నారు దర్శకుడు హను రాఘవపూడి. అసలు ఈ కథ ఎలా పుట్టిందో తెలిపారు. ఆగస్టు 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పుతుంది. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఏదో ఒక మలుపు తిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే” అని అన్నారు.

ఆ ఆలోచనే ఈ కథ… “నాకు కోఠి వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు వుంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది?

మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ ఆలోచని కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్” అని రాఘపూడి పేర్కొన్నారు.

ఈ యుద్ధం కనిపించదు.. “యుద్ధ నేపథ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. ‘యుద్ధంతో రాసిన ప్రేమ’ ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం కనిపించదు. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం ఉంటుంది. ఉదాహరణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం, సంఘర్షణ ఉంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో ఉంటుంది” అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news