Teja Sajja : థ్రిల్లింగ్ మూవీ..హనుమాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

విభిన్నమైన చిత్రాలు తీసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..ప్రస్తుతం ‘హనుమాన్’ సినిమా చేస్తున్నారు. ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ గా వస్తున్న ఈ చిత్రంలో హీరోగా తేజ సజ్జ నటిస్తుండగా, హీరోయిన్ గా అమృత అయ్యార్ నటిస్తోంది.


ఈ పిక్చర్ ను ప్రైమ్​షో ఎంటర్​టైన్మెంట్స్ బ్యానర్ పై కె.నిరంజన్‌ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ సినిమాలో హీరో వినయ్ రాయ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తి రేపగా, తాజాగా మరో పోస్టర్ ను దర్శకుడు ప్రశాంత్‌ వర్మ విడుదల చేశారు.

ఇవాళ హీరో తేజ సజ్జ పట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ పై క్లారిటీ ఇచ్చారు. దసరాకు కచ్చితంగా నీకు గిఫ్ట్‌ ఇస్తానంటూ.. తేజ సజ్జ ను ట్యాగ్‌ చేశాడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. దీంతో.. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్‌ కానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే.. డేట్‌ మాత్రం ఫైనల్‌ కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news