పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. ఇది వచ్చే సంవత్సరం జనవరి నెలలో రిలీజ్ కానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ – సైఫ్ అలీ ఖాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టు కొనేలా లేదని , గ్రాఫిక్స్ బాగా లేవని సోషల్ మీడియాలో కొంతమంది ట్రో ల్ చేశారు.
కొంత మంది హిందూ దేవుళ్లను కించ పరిచేలా వుందని విమర్శించారు.ఇందులో ముఖ్యంగా శ్రీరాముడు – రావణుడు – హనుమాన్ కనిపించిన విధానంపై పలువురు బీజేపీ నాయకులు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయోధ్య రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కూడా ‘ఆది పురుష్’ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆదిపురుష్ టీజర్‌కు వస్తోన్న నెగిటివ్ కామెంట్స్ పై దర్శకుడు ఓం రౌత్ మరోసారి వివరణ ఇచ్చారు. ఈ సినిమాను మేము ఎంతో రీసెర్చ్ చేసి, కష్టపడి తీశామని సినిమాపై తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలిపాడు. అందరి ఆనందం కోసమే ఈ మూవీని సిద్ధం చేశామన్నాడు.ఇటీవల విడుదల అయిన టీజర్ చూసి సినిమాపై అంచనా కరెక్ట్ కాదు. అసలైన కంటెంట్ మొత్తం సినిమాలో వుంటుందని, ఇంకా పూర్తి స్ధాయిలో గ్రాఫిక్స్ వర్క్ కాలేదని చెప్పారు. ఈ సినిమా విడుదలయ్యాక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, దానికి నేను హామీ ఇస్తున్నా దయచేసి నెగెటివిటి ప్రచారం చేయవద్దని కోరారు.