షారుక్​ ‘మన్నత్’​తో సల్మాన్​కు ఉన్న బంధం తెలుసా?

-

సినీ సెలబ్రిటీల ఇళ్లు ఎంత లగ్జరీగా ఉంటాయో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ తమ అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకుంటారు. అయితే వీరిలో బాలీవుడ్​ బాద్​ షా షారుక్​ ఖాన్​ బంగలా మన్నత్​కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దాదాపు రూ.200కోట్లు విలువ చేసే ఈ బంగలా సముద్రానికి ఎదురుగా.. ప్రకృతి అందాల మధ్య.. ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు ఇందులో ఉంటాయి. అంతేకాదు ఆరు అంతస్తుల బిల్డింగ్​కు షారుక్​ భార్య గౌరీఖాన్‌ ఎన్నో కోట్లతో అదిరిపోయే ఇంటీరియర్‌ డెకరేషన్‌ చేయించారు. అయితే తాజాగా ఈ ఇంటికి సంబంధించిన ఓ వార్త సోషల్​మీడియాలో ప్రచారం సాగుతోంది.

బాలీవుడ్ భాయ్​, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఇంటిపై అప్పట్లో కన్నేశారట. తన స్నేహితుడు ఇంటిపై ఆయన కన్నేయడం ఏంటీ అని మీకు అనుకుంటున్నారా? ఈ లగ్జరీ హౌస్​ను షారుక్​ కన్నా ముందే భాయ్​ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారట. కానీ ఆయన తండ్రి.. ఒక్కడికే అంత పెద్ద ఇల్లు ఎందుకని చెప్పడం వల్ల సల్మాన్​ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారట.

ఈ విషయాన్ని సల్మాన్​ రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఇంగ్లీష్ కథనాలు వస్తున్నాయి. “కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న తొలి రోజులవి. సముద్రతీరానికి దగ్గరగా ఉన్న ఆ బంగ్లాను చూస్తే ముచ్చటేసేది. ఆ ఇల్లు ఎలాగైనా కొనాలి అని అనుకునేవాడిని. సరిగ్గా అది అమ్మకానికి పెట్టినప్పుడు మొదట ఆ ఇంటిని కొనమని నా దగ్గరకే వచ్చారు. కొనడానికి అన్ని రెడీ చేసుకుంటున్న సమంయలో నాన్న వద్దని సలహా ఇచ్చారు. దాంతో నా ప్రయత్నం విరమించుకున్నాను” అని సల్మాన్​ చెప్పారు. అయితే తను మిస్ చేసుకున్న ఈ ఇంటిని తన స్నేహితుడు షారుక్​ కొనుగోలు చేయడం సంతోషంగా ఉందన్నారు సల్మాన్.

కాగా, రూ.200కోట్లు విలువ చేసే షారుక్​ మన్నత్​ చూడటానికి ఎంతో బాగుంటుంది. ఆ ఏరియా కూడా బాద్​షా అభిమానులతో సందడిగా ఉంటుంది. ఆరు అంతస్తుల గల ఈ బంగలాలో ఒక్కో అంతస్తుకి ఐదు బెడ్​రూమ్​లు ఉంటాయి. అలానే ఓ ప్రైవేట్ థియేటర్​, జిమ్​, లైబ్రరీ, స్విమ్మింగ్​ పూల్​, షారుక్ ఆఫీస్​ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news