కమెడియన్ ఆలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

-

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ పేరు సంపాదించారు. ముఖ్యంగా బాల నటుడుగా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ఆలీ ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించడమే కాకుండా హీరోగా కూడా పలు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఇక నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కించారు. ఆలీ ఎన్నో టీవీ షో కార్యక్రమాలకు హోస్టుగా కూడా నిర్వహించి బాగా పాపులర్ అయ్యారు. ఇక రాజకీయాలలో కూడా వైసీపీ తరఫున చురుకుగా ఉండి.. వైసిపి ప్రభుత్వం గెలుపులో భాగస్వామ్యం అయ్యారు. అందుచేతనే ఆలీ, ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఎంపిక చేయడం జరిగింది.

ఇక కమెడియన్ ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహ వేడుక హైదరాబాద్లో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎంతోపాటు సినీ ప్రముఖులలో చిరంజీవి, నాగార్జున తదితర సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. దీంతో ఇప్పుడు కామెడియన్ ఆలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఆలీ పెద్ద కూతురు ఫాతిమా రీసెంట్గా డాక్టర్ కోర్స్ ని పూర్తి చేసిందట. ఆలీ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ అయినది. ఇక ఆలీ అల్లుడు షెహ్యాజ్ కూడా డాక్టర్ కావడం విశేషం.

జమీలా బాబి, జలాని భాయ్ కు జన్మించిన కుమారుడే షెహ్యాజ్. షెహ్యాజ్ కు ఒక అన్నయ్య, చెల్లెలు కూడా ఉన్నారు. ఇక వీరే కాకుండా షెహ్యాజ్ వదిన కూడా ఒక డాక్టర్.. వీరంతా గుంటూరు ప్రాంతానికి చెందినవారు అయినప్పటికీ లండన్ లో స్థిరపడ్డారు. కమెడియన్ ఆలీ ఏరి కోరి మరి తన కూతురికి డాక్టర్ నీ ఎంపిక చేసుకున్నారు. వారి కూతురు పెళ్లి వివాహానికి సంబంధించి అన్నిటిని ఆలీ భార్య ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ వీడియోస్ ద్వారా పోస్ట్ చేస్తూనే ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news