సావిత్రి – రేఖ మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుసా..?

-

అలనాటి సీనియర్ హీరోయిన్ సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..అటు బాలీవుడ్ లో కూడా నటిరేఖ మంచి గుర్తింపును తెచ్చుకుంది.. ఇకపోతే అందానికే అందం ఆమె.. నేల మీద నడిచే పారిజాతం.. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి స్టార్డం సంపాదించిన నటి శిఖామణి రేఖ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది. నేడు ఆమె 68 వ యేట అడుగు పెట్టింది. మహానటి కి ఈమెకు మధ్య ఒక సంబంధం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు ఒకసారి మనం చదువు తెలుసుకుందాం.

నటి రేఖ అందంతోపాటు అభినయం కలగలిసిన ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈమె.. ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంది. ప్రముఖ నటి మాజీ రాజ్యసభ సభ్యురాలు అయిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రేఖ ఎన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా నాటి నుంచి నేటి వరకు రేఖ అంటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా.. ఎమోషన్స్ కి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 1954 అక్టోబర్ 10వ తేదీన చెన్నైలో జన్మించింది రేఖ . ఈమె తల్లిదండ్రులు ప్రముఖ తమిళ నటుడు జెమినీ గణేషన్, పుష్పవల్లి.

రేఖ అసలు పేరు భాను రేఖ. మహానటి సావిత్రి ఈమెకు పిన్ని అవుతారు .అంటే ఈమె తండ్రి జెమినీ గణేషన్ కు సావిత్రి రెండవ భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే. జెమినీ గణేషన్ మొదటి భార్య పుష్పవల్లికి జన్మించింది రేఖ . ఇక బాల నటిగా తన సినీ కెరియర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత గ్లామర్ హీరోయిన్ గా తన ప్రపంచాన్నే మార్చేసుకుంది. నట ప్రస్థానమే కాదు రాజ్యసభ సభ్యురాలు కూడా .. ఈమె తండ్రి జెమినీ గణేషన్ తో వివాదాన్ని మొదలుకొని అమితాబ్ బచ్చన్ తో ప్రేమాయణం వరకు అన్నీ కూడా ఆమె జీవితంలో ఎన్నో అంతిచిక్కని కోణాలుగా మిగిలిపోయాయి.ఇక వన్నెతెరగని అందంతో స్టార్ హీరోయిన్గా చలామణి అయ్యింది రేఖ.

Read more RELATED
Recommended to you

Latest news