చిరంజీవికి తల్లిగా, చెల్లిగానే కాక ఆయనకు జోడీగా నటించిన హీరోయిన్స్ వీళ్లే..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..ప్రజెంట్ వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘ఆచార్య’గా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేపోయిన చిరు..త్వరలో ‘గాడ్ ఫాదర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించి చెల్లిగా, తల్లిగానూ నటించిన హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం..

 

జనరల్ గా హీరోయిన్స్ కు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువ కాలం ఉండబోవు. కొంత కాలం తర్వాత వాళ్లు రిటైర్ అయిపోవాల్సి ఉంటుంది. లేదా సపోర్టింగ్ రోల్స్ ప్లే చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఫేమస్ హీరోయిన్స్ కొంత కాలం తర్వాత తల్లి, వదిన పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పటికే షురూ చేయడం మనం చూడొచ్చు కూడా. కాగా, అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించి ఆ తర్వాత ఆయనకు తల్లిగా నటించిన నటీమణులు ఉన్నారు. వారు ఎవరంటే..

సహజ నటి జయసుధ..చిరంజీవి ‘ఇది కథ కాదు’ చిత్రంలో నటించింది. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో పాటు చిరంజీవి ‘మగధీరుడు’ చిత్రంలో జయసుధ హీరోయిన్ గా నటించింది.
అంతలోనే కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘రిక్షావోడు’ పిక్చర్ లో జయసుధ…మెగాస్టార్ కు మదర్ గా నటించింది.

చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన జయసుధ..ఆ వెంటనే చిరంజీవికి తల్లిగా నటించడం చూసి జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ‘ప్రేమతరంగాలు’ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటించిన సుజాత..ఆ తర్వాత ‘సీతాదేవి’ మూవీలో చిరంజీవికి చెల్లెలిగా నటించింది. ఇక ‘బిగ్ బాస్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి తల్లిగా సుజాత నటించింది. ఇక ప్రజెంట్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ లో చిరంజీవికి తల్లిగా గంగవ్వ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news