‘రానా నాయుడు’సిరీస్ కోసం వెంకీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

-

Rana Naidu: బాహుబలి భళ్లాల దేవ రానా దగ్గుబాటి, సూపర్ స్టార్ విక్ట‌రీ వెంకటేష్ లతో కాంబినేషన్ లో నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టు వచ్చిన విష‌యం తెలిసిందే. బాబాయ్ అబ్బాయ్ లు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న డ్రామా సిరీస్‌కు ‘రానా నాయుడు’ అనే టైటిల్ తో తెరకెక్కించింది నెట్ ఫ్లిక్స్. అమెరిక‌న్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా ఈ సిరీస్ రాబోతుంది.

లోకోమోటివ్ గ్లోబర్ ఇంక్ అనే సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిచింది. ఇక ఈ సినిమా నిన్న రిలీజ్‌ అయింది. అయితే ఈ సిరీస్ లో నటించినందుకుగాను వెంకి మామ పారితోషికంగా ఎంత తీసుకున్నారు? రానా ఎంత అందుకున్నాడనే విషయంలో సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించేందుకు వెంకటేష్ దాదాపు రూ.12 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రానా కూడా రూ. 8 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news