జైలర్ 2 గురించి దర్శకుడు నెల్సన్ ఏమన్నారో తెలుసా ? 

-

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్. ఈ సినిమా డార్క్ కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దిశగా కొనసాగుతుంది జైలర్ మూవీ. ఈ సందర్భంగా జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ పార్ట్ 2 పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ప్రస్తుతం జైలర్ పార్ట్ 2 కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా జైలర్ పార్ట్ 2 చేయాలనుందని వెల్లడించారు దర్శకుడు నెల్సన్. అదేవిధంగా గత సినిమాలు అయిన బీస్ట్, డాక్టర్, కోలమావు కోయిన వంటి చిత్రాలకు కూడా సెకండ్ పార్ట్ చేయాలని ఉందని తన మనస్సులో ఉన్న మాటను బయటపెట్టారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ లతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉందని.. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్  చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలలో నెల్సన్ తరువాత ప్రాజెక్ట్ ఏది అవుతుందో వేచి చూడాలి మరీ. 

Read more RELATED
Recommended to you

Latest news