హింసాత్మక ఘటనలతో అట్టుడికిన మణిపూర్ లో ఇప్పుడిప్పుడే కాస్త శాంతియుత వాతావరణం నెలకొంటోంది. అయితే ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మణిపూర్ లో ఓ ప్రత్యేకత చాటుకున్నాయి. ఉగ్రవాదుల నుంచి విముక్తిని కోరుకుంటున్న యువత ఓ హిందీ సినిమాను బహిరంగంగా ప్రదర్శించబోతున్నారు. మణిపూర్ లో దాదాపు 25 ఏళ్ల తరువాత హిందీ సినిమాను ప్రదర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
అయితే సినిమా పేరు మాత్రం ప్రకటించలేదు. మణిపూర్ లో చివరగా కుఛ్ కుఛ్ హోతా హై అనే సినిమాను 1998లో ప్రదర్శించారు. దేశ వ్యతిరేక ఉగ్రవాద సంస్థల నుంచి స్వాతంత్య్రాన్ని తాము ప్రకటిస్తున్నామని గిరిజన సంఘం హ్మర్ స్టూడెంట్ అసోసియేషన్ గుర్తు చేసింది. మణిపూర్ లో హిందీ సినిమాల ప్రదర్శనను రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ 2000లో నిషేదించింది. నిషేదించిన వారం రోజుల్లోనే దాదాపు 8వేలకు పైగా హిందీ ఆడియో, వీడియోకి సంబంధించిన సీడీలను తగులబెట్టారు ఉగ్రవాదులు. ఈ నిషేదానికి కారణం ఏమిటనేది మాత్రం ఇప్పటివరకు కూడా ప్రకటించకపోవడం గమనార్హం.