28 ఏళ్ల క్రితం కృష్ణ గారి కోసం శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా.. !

-

హీరోగానే కాదు వ్యక్తిగతంగా మంచి మనుసున్న చాటుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ.. నటుడుగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న కృష్ణ కోసం గతంలో ప్రముఖ రచయిత శ్రీ శ్రీ గారు అన్నమాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

కష్టకాలంలో నిర్మాతల్లో ఆదుకున్న గొప్ప నటుడు సూపర్ స్టార్ కృష్ణ.. ముఖ్యంగా తన నటన జీవితంతోనే కాకుండా వ్యక్తిగతంగా తన మంచి మనసుని చాటుకొని అభిమానులు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కృష్ణ గారి ప్రస్థానం ఎన్నటికీ మరవలేనిది.. అలాంటి ఆయన గురించి ప్రముఖ రచయిత, మహాకవి శ్రీశ్రీ గతంలో ఏమన్నారో తెలుసా. అప్పట్లోనే తనదైన రాతలతో కృష్ణ గొప్పతనాన్ని శ్రీశ్రీ చాటిచెప్పారు. ఓ సందర్భంలో కృష్ణ గురించి ప్రస్తావించిన శ్రీ శ్రీ.. “నేను ఒక అక్షరం రాసినా దానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చిన ఏకైక వ్యక్తి కృష్ణ” అని శ్రీశ్రీ అన్నారు. 1994లో ఓ ప్రముఖ పత్రికలో ఈ మాటలు ప్రచురితమయ్యాయి.. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఆయన గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు సినీ అభిమానులు..

కృష్ణ తన కెరీర్లో 350 కి పైగా చిత్రాల్లో నటించగా అందులో చాలా సినిమాలకి శ్రీశ్రీ గారు మాటలు అందించారు.. కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రానికి శ్రీశ్రీ మాటలు అందించారు.. అలాగే రచయితలు అంటే కృష్ణ గారికి ఎంతో అభిమానం అంట వారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే నెక్స్ట్ సినిమాకు అడ్వాన్స్ ఉంచండి అంటూ ముందుగానే ఎంతో కొంత డబ్బులు వారి చేతిలో పెట్టేవారట..

Read more RELATED
Recommended to you

Latest news