ఏంటయ్యా దేవి ఇది.. చరణ్ సినిమాలానే మహర్షిని కూడా..!

-

స్టార్ హీరోల సినిమాలకు సినిమాలో ప్రతిది పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తారు. కథ, స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు మాత్రం పుష్కలంగా ఉండేలా చూసుకుంటారు. ఇక మ్యూజిక్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. స్టార్ మ్యూజిక్ ట్రెండ్ సెట్టర్స్ అవ్వాల్సిందే. అలాంటి స్టార్స్ కు మ్యూజిక్ అందిస్తున్న డిఎస్పి ఈమధ్య అంచనాలను అందుకోవట్లేదు.

ఒకప్పుడు దేవి మ్యూజిక్ అంటే దుమ్ముదులిపేసేది. కాని ఇప్పుడు అలా లేదు. దేవి మ్యూజిక్ అందిస్తున్న సినిమాల్లో తన మార్క్ మిస్ అవుతుంది. ఈ ఇయర్ వినయ విధేయ రామ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. సినిమాలో సాంగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు మహర్షి సినిమాకు మహేష్ ఫ్యాన్స్ ను తీవ్రంగా డిజప్పాయింట్ చేశాడు దేవి. పదర పదర సాంగ్.. పాలపిట్ట పర్వాలేదు అన్నట్టు ఉండగా మిగతా మూడు పెద్దగా మెప్పించలేదు. దేవి మ్యూజిక్ తో సగం సినిమా హిట్ అన్న టాక్ ఉండేది కాని దేవి మ్యూజిక్ సినిమాకు మైనస్ అయ్యేలా ఉంది.

మరి దేవి ఇలానే చేస్తే అతన్ని తీసి పక్కన పెట్టే అవకాశం ఉంది. మహర్షి సాంగ్స్ లో ఫెయిల్ అయిన దేవి బిజిఎం అయినా కొత్తగా ఇచ్చాడో లేక అదే రణగొణ ధ్వనులతో మమా అనిపించాడో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news