హా.. కండోమ్స్ ను మింగేయడమేందని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ.. నిజంగానే ఇది నిజం. ఓ వ్యక్తి కడుపులో ఏకంగా 80 కండోమ్స్ ఉన్నాయి. అవి కూడా మామూలు కండోమ్స్ కాదు.. డ్రగ్స్ నింపిన కండోమ్స్. అవును.. డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఇదో దందా అన్నమాట.
డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేయడం కోసం.. అంటే ఒక దేశం నుంచి మరో దేశానికి డ్రగ్స్ ను తరలించడం కోసం కండోమ్ ప్యాకెట్లలో డ్రగ్స్ నింపి వాటిని మింగేస్తారు. వేరే దేశం వెళ్లాక వాటిని మళ్లీ కక్కేస్తారు. అలా డ్రగ్స్ ను దేశాలు దాటిస్తారన్నమాట.
మామూలుగా డ్రగ్స్ ను పట్టుకెళ్తే దొరికిపోతారు కదా. అందుకే ఈ వెదవ తెలివి తేటలు. అయితే.. ఓ వ్యక్తి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అతడు.. డ్రగ్స్ ఎలా స్మగ్లింగ్ చేశాడంటే.. సేమ్ టు సేమ్ మనం పైన చెప్పుకున్నట్టే… కండోమ్స్ లో డ్రగ్స్ నింపి అన్నమాట.
అలా 80 కండోమ్ ప్యాకెట్లను మింగేసిన ఆ ప్రయాణికుడు దుబాయ్ నుంచి ఈజిప్టుకు వెళ్లే విమానం ఎక్కబోతూ అడ్డంగా కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు. దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో అతడిని చూసి అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు.. అతడి పొట్టను స్కాన్ చేసి షాక్ అయ్యారు. పొట్ట ఇంత టైట్ గా ఉందేంటని అడిగితే.. ఫుల్లుగా బిర్యానీ మెక్కానని చెప్పాడు. కానీ… వాళ్లు నమ్మలేదు. వెంటనే అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అతడి పొట్టను స్కాన్ చేసిన డాక్టర్లు అతడి పొట్టలో ఉన్న కండోమ్ ప్యాకెట్లను చూసి షాకయ్యారు.
వెంటనే అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా… తాను వాటిలో కొకైన్ నింపి మింగినట్టుగా ఒప్పుకున్నాడు. దుబాయ్ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో మీకు తెలుసు కదా. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఆ వ్యక్తికి లక్ష దినార్ల జరిమానాతో పాటు.. పదేళ్ల జైలు శిక్ష విధించారు. అతడు తన జైలు శిక్ష అనుభవించడం పూర్తయ్యాక.. అతడిని తమ దేశం నుంచి బహిష్కరించనున్నారు దుబాయ్ అధికారులు.