ఇండియన్-2లో సర్ ప్రైజ్ స్టార్

-

2.ఓ తర్వాత శంకర్ రెండు దశాబ్ధాల క్రితం చేసిన ఇండియన్ అదేనండి భారతీయుడు సినిమా సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నాడని తెలిసిందే. నవంబర్ 29న 2.ఓ రిలీజ్ అవడం ఆలస్యం కమల్ తో ఇండియన్-2 మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు శంకర్. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందట. భారతీయుడు సినిమాలో కమల్ నట విశ్వరూపం అందరికి తెలిసిందే. శంకర్ డైరక్షన్ టాలెంట్ కూడా అందరికి తెలిసేలా చేసింది ఆ సినిమా.

ఇక ఇప్పుడు ఆ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ సీక్వల్ గా మరింత అంచనాలను ఏర్పర్చుకుంది. అంతేకాదు ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా మరో స్టార్ హీరో నటిస్తున్నాడట. అతనెవరో కాదు మళయాల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అని తెలుస్తుంది. మళయాల స్టార్ హీరో మమ్ముట్టి తనయుడైన దుల్కర్ సల్మాన్ తండ్రి తగ్గ తనయుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. మళయాలంలో వరుస విజయలాతో దూసుకెళ్తున్న దుల్కర్ తెలుగులో మహానటి సినిమాతో అందరిని మెప్పించాడు. తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన ఓకే బంగారం సినిమా కూడా దుల్కర్ కు హిట్ ఇచ్చింది.

ఇండియన్-2లో దుల్కర్ సల్మాన్ కూడా కమల్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. కమల్, మమ్ముట్టి మంచి స్నేహితులు. ఇప్పుడు ఆ స్నేహితుడి కొడుకుతో కమల్ క్రేజీ ప్రాజెక్ట్ చేయడం అటు మళయాలంలో కూడా ఇండియన్-2పై అంచనాలు పెరిగేలా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news