ఇమ్మాన్యుయేల్ ఒప్పుకోకపోతే చనిపోతా..వర్ష.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

ఈటీవీ ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ షో నుంచి ఎంతోమంది స్టార్ కమెడియన్స్ బయటకు వెళ్లిపోయి.. ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ షో వేదిక పైన లవ్ ట్రాక్లకు కొదవలేదని చెప్పాలి. అయితే రేటింగ్స్ కోసం నిర్వాహకులు ఇలాంటి లవ్ ట్రాకులు తెరపైకి తీసుకువచ్చి స్టంట్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఇక తాజాగా రిలీజ్ అయిన ఎక్స్ట్రా జబర్దస్త్ షో యొక్క ప్రోమో చూస్తే అలానే అని అర్థమవుతుంది. ఇకపోతే ఈ షోలో రష్మి – సుధీర్ జంట తర్వాత బాగా ఫేమస్ అయిన జంట ఇమ్మాన్యుయేల్ – వర్ష

ఇక వీరిద్దరిపై లవ్ ట్రాక్ నడుస్తుందని బుల్లితెరపై ఎప్పటినుంచో హైలెట్ చేస్తున్నారు. ఇక సమయం వచ్చినప్పుడల్లా కూడా ఒకరి మీద ఒకరికి ఉన్న అమితమైన ప్రేమను చూపించుకుంటున్నట్లు స్క్రీన్ పై చూపిస్తారు. మొదట్లో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉందేమో అన్నంతగా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ రావడంతో ఈ జంటకు కొంచెం బ్రేక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇద్దరు కూడా స్కిట్లు చేస్తున్నప్పటికీ ఆన్ స్క్రీన్ రొమాంటిక్ డైలాగ్స్ మాత్రం చెప్పుకోలేదట. దీంతో జబర్దస్త్ షోలో వీరిద్దరి లవ్ ట్రాక్ కి బ్రేకులు పడ్డాయా? అని రూమర్లు కూడా బాగా స్ప్రెడ్ అయ్యాయి. అయితే మరోసారి రూమర్లకు చెక్ పెడుతూ ఈ జంట రెచ్చిపోయింది. తన ప్రేమ నిజమైనదే అంటూ వర్షా స్టేజ్ పైనే ఒప్పుకుంది.Jabardasth Emmanuel - Varsha: ఇమ్మాన్యుయేల్‌‌కు వేరే అమ్మాయితో పెళ్లైతే చచ్చిపోతా.. స్టేజీపైనే ఏడ్చేసిన వర్ష.. | I wont live without Emmanuel says Jabardasth lady comedian actress ...ఇక స్కిట్ లో భాగంగానే.. ఇమ్ము కాదన్న రోజు.. ఈ వర్ష ఊపిరి ఉండదు.. అంటూ తన ప్రేమను మరోసారి బయట పెట్టింది వర్ష. దీంతో ఇమ్మాన్యుయేల్ ఆనందంతో ఊగిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త నెటిజల్లును బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.