సెలెక్టర్ల తీరుపై వెటరన్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వాక్యాలు చేశారు. టీ 20 లకు ఎందుకు ఎంపిక చేయడం లేదో తనకు తెలియదని అన్నాడు. కేవలం తన పరిధిలోకి వచ్చే విషయాల గురించే మాట్లాడుతానని ఇతర వాటిని పట్టించుకోనని స్పష్టం చేశాడు. ఆటలో ఎలా రాణించాలన్న దానిపైన దృష్టి పెడతానని, మిగతా వాటి గురించి ఆలోచించనని తెలిపాడు.
అయితే టి20లకు ఎంపిక చేయకపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుందని, కానీ దాని గురించి పట్టించుకోనని చెప్పాడు ధావన్. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని అది వన్డే నైనా, టి20 లో నైనా అని స్పష్టం చేశాడు. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్, గత కోచ్ రవి శాస్త్రి వ్యవహార శైలి వేరు అని ఇద్దరి పనితీరు పూర్తి విరుద్ధంగా ఉంటుందన్నారు.
తనకు ఇద్దరితోను అనుబంధం ఉందని గుర్తు చేశాడు. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ తో పనిచేయడం సంతోషంగా ఉందన్నాడు. తనకు వన్డేలు టీ 20 లు టెస్టులు ఒక్కటేనని ఆటను ఆస్వాదిస్తానని తెలిపాడు. ఇటీవల శిఖర్ ధావన్ వన్డేలో కీలకంగా మారాడు. టీమిండియా జూనియర్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతడి సారథ్యంలో టీమిండియా సిరీస్ లను కైవసం చేసుకుంది.