ఆ అలవాటుతోనే 1000 కోట్లకు పైగా ఆస్తిని పోగొట్టుకున్నా.. జగపతిబాబు వైరల్ కామెంట్స్..

-

టాలీవుడ్ హీరో జగపతిబాబు ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. కెరియర్ మొదట్లో హీరోగా నటించిన తర్వాత మాత్రం విలన్ గా మెప్పించి వరుస అవకాశాలు అందుకుంటున్నారు.. ప్రస్తుతం సక్సెస్ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తున్న జగపతిబాబు తాజాగా గతంలో పోగొట్టుకున్న ఆస్తులపై స్పందించారు..హీరో జగపతిబాబు దాదాపు 40 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హీరోగా ఆయన వందల సినిమాల్లో నటించారు. అయితే అతని జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు అతన్ని తలకిందులు చేశాయి. అంతేకాకుండా ఆస్తి మొత్తం పోయి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా తన కెరీర్ మొదలుపెట్టి వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు.

Jagapathi Babu - IMDb

ఐతే ఎప్పటికప్పుడు తన జీవితంలో ఎదురైన సంఘటనలు చెప్పుకుంటూ వస్తున్న జగపతిబాబు తాజాగా ఆయన పోగొట్టుకున్న ఆస్తులు ఎన్ని కోట్ల రూపాయలు తెలిపి అందరిని షాక్కు గురి చేశారు..జగపతి బాబు తను పోగొట్టుకున్న ఆస్తులపై మొదటిసారిగా స్పందించారు. ఈ విషయంపై మాట్లాడుతూ.. “నా ఆస్తి క్యాసినో, పేకాటతో పేలేదు. వేరే వాళ్లు దోపిడి చేశారని కూడా అనను. డబ్బుల విషయంలో లెక్కలేకపోవడం, జాగ్రత్తగా ఉండకపోవడం మూలంగా అలాంటి పరిస్థితి వచ్చింది. నాకు డబ్బు విషయంలో అయితే జీరో నాలెడ్జ్.. లెక్క ప్రకారం.. నేను సంపాదించిన ఆస్తుల విలువ ఇప్పుడు 100‌0 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే అంతలా ఆస్తులు పోగొట్టుకోవడానికి కారణం ఏంటనేది చాలా పెద్ద ప్రశ్న. సమాధానం చెప్పడం కష్టం కూడా.. ఇక క్యాసినోతో ఆస్తులు పోలేదు. నేను సరదాకు మాత్రమే ఆడతాను. అలాగే అంత డబ్బు ఎలా పోయిందనే దానికి క్లారిటీ లేదు. ఒకరి బ్లేమ్ చేయను కూడా. చెప్పాలంటే చాలా మందే ఉన్నారు. బ్రోకర్స్ వల్ల కావచ్చు. నేను కూడా జాగ్రత్తగా ఉండకపోవడంతో అలా జరిగి ఉండచ్చు. ఇందులో నా పొరపాటు కూడా తప్పకుండా ఉంది..” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news