రవితేజ క్రాక్ సినిమా మీద భారీగా పెరుగుతున్న అంచనాలు …?

-

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “క్రాక్‌”. డాన్‌ శీను, బ‌లుపు వంటి కమర్షియల్ హిట్ సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ ఈ సినిమా హిట్ తప్పనిసరి. దాంతో ఈ సినిమా విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నాడట రవితేజ. అంతేకాదు ఎప్పుడు షూటింగ్ వరకే పరిమితమయ్యో రవితేజ ఈ సినిమా విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎడిటింగ్ చాలా పక్కాగా చూస్తున్నాడట.

 

ఇక ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్స్ తో క్రాక్ సినిమా మీద అంచనాలు భారీగా నెలకొన్నాయి. జూలై లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితిని బట్టి జూలై మూడోవారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారట. ఇక శృతిహాసన్ చాలా కాలం తర్వాత మళ్ళీ “క్రాక్‌” సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే రవితేజ తో శృతిహాసన్ బలుపు సినిమాలో నటించి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా నటిస్తుంది. తెలుగులో వరలక్ష్మి చేస్తున్న రెండవ సినిమా క్రాక్. ఈ సినిమాలో లేడీ విలన్ గా నటిస్తుందట.

ఇప్పటికే తెలుగులో ఇప్పటికే తెనాలి రామకృష్ణ సినిమాలో లేడీ విలన్ గా నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వరలక్ష్మి చాలా పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతుందట. ఇక ఇదే సినిమాలో సముద్ర ఖని కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడైన సముద్ర ఖని తమిళ సినిమాలలో నటుడిగాను పాపులర్ అయ్యాడు. అంతేకాదు రవితేజ క్రాక్ లో కూడా నటిస్తున్నాడు. ఇందులో భాగంగా రీసెంట్ గా క్రాక్ సినిమానుండి సముద్ర ఖని లుక్ ని రిలీజ్ చేశారు. కొన్ని రోజుల గ్యాప్ లోనే వరలక్ష్మీ లుక్, సముద్ర ఖని లుక్ లని రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెంచేలా చేస్తున్నారు. అంతేకాదు ఈసారి పక్కా హిట్ నమ్మకంతోను రవితేజ ఉన్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news