ఎఫ్-2 ఫస్ట్ టాక్.. సంక్రాంతి హిట్టు ఇదేనా..!

-

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబోలో మల్టీస్టారర్ మూవీగా వచ్చిన సినిమా ఎఫ్-2. దిల్ రాజు బ్యానర్ లో అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుండగా ఆల్రెడీ యూఎస్ లో ప్రీమియర్స్ తో సినిమా టాక్ బయటకు వచ్చింది. సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ అని వెంకటేష్ కామెడీ అదుర్స్ అని అందరు అంటున్నారు. అనీల్ రావిపుడి డైలాగ్స్ బాగున్నాయట.

ప్రీమియర్స్ తో ఆల్రెడీ ఎఫ్-2 హంగామా స్టార్ట్ అయ్యింది. ఈ పొంగల్ వార్ లో తక్కువ అంచనాలతో వచ్చిన ఎఫ్-2 మూవీ ఎన్.టి.ఆర్, వినయ విధేయ రామ, పేట సినిమాలను మించి హిట్ టాక్ సొంతం చేసుకోవడం ఖాయమని అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సంబరాలు తెస్తుందని ఆశిస్తున్నారు. మరి అసలు టాక్ ఏంటి అన్నది మన దగ్గర షోలు పడితే కాని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news