ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఒక్కరోజు పారితోషికం తెలిస్తే షాక్..!

-

ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎక్కువగా విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఒక రకంగా చెప్పాలి అంటే.. విలన్ పాత్రలతో కూడా కామెడీ పండించగల గొప్ప నటుడు అని చెప్పవచ్చు. ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత పూర్తిగా మనుషులంటేనే భయపడి పోయిన అజయ్ ఘోష్ సుకుమార్ కోరిక మేరకు ఆయన సలహా మేరకు పుష్ప సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇక తన నటనతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన విషయాలను అలాగే ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోలకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తూ బాగా వైరల్ అవుతున్నారు.

ఇకపోతే నిన్నటికి నిన్న అల్లు అర్జున్ గొప్పతనాన్ని చెప్పిన ఈయన నేడు సుకుమార్ వ్యక్తిత్వాన్ని పొగిడారు. ఇక అంతే కాదు బాహుబలి 2 సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో అనుష్కకు నాకు ఫైట్ సీన్ ఉంటుంది.. కానీ సీన్ లీక్ కావడంతో ఎడిటింగ్ లో నా సీన్లు పోయాయని ఆయన తెలిపారు. ప్రొడ్యూసర్లు బ్రతికితే మాత్రమే సినిమా స్థాయి పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ రేంజ్ ను చూపించుకోవడం కోసం అసిస్టెంట్లను పెట్టుకుంటున్నారు. అయితే కొంతమంది ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని అజయ్ ఘోష్ వెల్లడించారు.

ఇక తానేంటో తనకు బాగా తెలుసునని.. తన నుంచి దర్శక నిర్మాతలు ఏం కోరుకుంటున్నారో అదే చేస్తానని చెప్పారు. పుష్ప సినిమా తర్వాత ఇతర భాషల నుంచి సినీ ప్రముఖుల నుంచి కాల్స్ వచ్చాయని, ప్రశాంత్ నీల్ కూడా కథ చెప్పారు అని , సినిమాలో ఉంటానో లేదో తెలియదని కూడా ఆయన తెలిపారు. ఇదంతా ఉండగా ఈయన ఒకరోజు షూటింగ్లో పాల్గొంటే ఎంత పారితోషకం తీసుకుంటాడు అనే విషయాన్ని కూడా ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఆరు రోజులకు ఆరు లక్షల రూపాయలు వస్తాయని అనుకుంటే .. మూడు రోజుల్లో నా పార్టు షూటింగ్ పూర్తి కావడంతో మూడు లక్షల రూపాయలు ఇచ్చారని ఆయన తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే అజయ్ ఘోష్ ఒక్క రోజు పారితోషకం లక్ష రూపాయలు అన్నట్టుగా తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version