నయనతారని అందుకు ఒప్పించారా..!

-

కోలీవుడ్ స్టార్ హీరో నయనతార అక్కడ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తమిళంలో ప్రయోగాలతో అక్కడ స్టార్స్ కు సైతం చుక్కలు చూపిస్తుంది. ఇక ఆమె నటించే సినిమాల్లో కంటెంట్ అయితే సూపర్ అనేలా ఉంటాయి. సినిమాల కోసం అంత కష్టపడే నయన్ ప్రమోషన్స్ అంటే మాత్రం పారిపోతుంది. తన సినిమాలు ఆడియెన్స్ తప్పకుండా చూస్తారన్న నమ్మకమో ఏమో కాని తెలుగు, తమిళ భాషల్లో నయనతార నటించిన సినిమాలు ప్రమోషన్స్ కు మాత్రం ఆమె రాదు.

అయితే ప్రస్తుతం నయనతార చేస్తున్న సైరా సినిమా కోసం మాత్రం ముందు అగ్రిమెంట్ లో భాగంగా ప్రమోషన్స్ కు వచ్చేలా ఆమెను ఒప్పించారట. నయనతార కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చేస్తున్న 151వ సినిమాగా సైరాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news