సమంత శాకుంతలం మొదటి రివ్యూ..!

-

డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్రోల్ పోషిస్తున్న మైథాలజికల్ మూవీ శాకుంతలం. ఈ సినిమా ప్రీమియర్ టాక్ తాజాగా బయటకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా మొదటి రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇకపోతే సమంత ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. ఇకపోతే ఇందులో ఆమె శకుంతలగా నటిస్తుండగా దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు.

గుణ టీం వర్క్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై నీలిమ గుణ , దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 14వ తేదీన అంటే రేపు శుక్రవారం రోజున థియేటర్లలో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది.ఇప్పటికే సినిమాని పెయిడ్ ప్రీమియర్ షో వేశారు. దీనికి వస్తున్న స్పందన ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సమంత ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత వాటిని దాటుకొని అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది.. ఇక తాను ఒక పవర్ఫుల్ ఉమెన్ అని నిరూపించుకుంది. సరిగ్గా శాకుంతలం సినిమాలో కూడా శకుంతల పాత్ర కోసం అలాంటి స్ట్రగుల్ పడబోతోంది. ముఖ్యంగా సమంతాకు ఈ సినిమాకి మంచి కనెక్షన్ ఉందని చెప్పవచ్చు.

ఈ సినిమాలో ఎమోషన్స్, స్ట్రగుల్స్ తో పాటు శకుంతల, దుష్యంతుల మధ్య ప్రేమ కథ ప్రధానంగా సాగుతుందట. శృంగార కోణం కాకుండా ఆమె పడే బాధలు, సంఘర్షణ వంటి భావోద్వేగాల సమూహారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.. ఇకపోతే ప్రీమియర్ షో నుంచి ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ లభిస్తోంది. సమంత అద్భుతంగా చేసిందని ఆమె పడే బాధలను దర్శకుడు చాలా చక్కగా చూపించారని అంటున్నారు. అల్లు అర్హ పాత్ర కూడా సర్ప్రైజింగ్ గా ఉంటుందని.. ఆమె చెప్పే డైలాగ్ లు చాలా ముచ్చటగా ఉంటాయని సమాచారం. అవతార్ లాంటి సినిమాలు చూసిన వారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు అని… ఇందులో విజువల్ అంత పర్ఫెక్ట్ గా లేదని సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news