నటులు వాళ్ళ నిజ జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు ఏదో ఒక సందర్భంలో చెప్తూ ఉంటారు. ఏదైనా ఇంటర్వ్యూ ని ఇస్తున్న సమయంలో కానీ సోషల్ మీడియాలో కానీ షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజా ప్రముఖ నటి దెబీనా ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చారు. వివరాలని చూస్తే.. దెబీనా బొనర్జీ గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈమె ఐవీఎఫ్ విధానాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈమె ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను బయట పెట్టారు. కొన్నాళ్ల పాటు పిల్లల కోసం ఎంతగానో చూశానని ఆమె చెప్పుకొచ్చింది.
ఆ తరవాత డాక్టర్స్ ని కన్సల్ట్ చేసానని.. వాళ్లు మొదట ఐయూఐ విధానాన్ని ఎంపిక చేసుకోవాలని చెప్పారని అన్నారు. అయితే ఇది ఏమి హానికర ప్రక్రియ కాదు కనుక నేను వెంటనే అందు కోసం అంగీకరించానని తెలిపారు. కానీ ఈ విధానం తనకు పని చేయలేదని చెప్పారు ఆమె. అయితే ఐదు సార్లు ట్రై చేసినా కూడా అవ్వలేదు అని ఆమె తన బాధ ని చెప్పుకొచ్చింది.
ఇలా పదే జరగడం తో నిరాశ కి గురయ్యానని ఆమె అంది. ఆ తర్వాత ఐవీఎఫ్ విధానాన్ని ఎంచుకున్నానని ఆమె చెప్పింది. పిండాన్ని కడుపు లోకి ప్రవేశ పెట్టడానికి 30,000 రూపాయలు తీసుకున్నట్టు చెప్పారామె. ఆస్పత్రిని బట్టి ధర లో మార్పులు ఉంటాయని ఐవీఎఫ్ ఎందుకని చాలామంది అడిగారని ఆమె అన్నారు. ఇలా ఆఖరి కి ఐదు సంవత్సరాల పాటు ప్రయత్నించాక పాప పుట్టిందని దెబీనా అన్నారు.