నాని “దసరా” కోసం నలుగురు స్టార్ హీరోలు..!

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “దసరా”. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గోదావరిఖని బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నాని కెరియర్ లోనే దసరా హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించగా.. అలాగే మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న దసరా చిత్రాన్ని మార్చి 30వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్ర బృందం. దసరా టీజర్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. పాన్ ఇండియా లేవెల్ లో రూపొందిన ఈ చిత్ర టీజర్ ను నాలుగు భాషలలో నలుగురు స్టార్స్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. తమిళ్ లో ధనుష్, మలయాళం లో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి, హిందీలో షాహిద్ కపూర్ ఈ టీజర్ ని విడుదల చేస్తారని వీడియో క్లిప్ ద్వారా వెల్లడించారు మేకర్స్.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?