హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ టీడీపీ ఎంపీ వార‌సుడు..

అమరరాజా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గల్లారామచంద్ర నాయుడి మనవడు,గుంటూరు ఎంపీ జయదేవ్‌ కుమారుడు అయిన గల్లా అశోక్‌ త్వరలో టాలీవుడ్‌కు హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇతగాడి సినిమా ఆ మధ్య దిల్ రాజు బ్యానర్ లో సినిమా ప్రారంభించి ఆగిపోయింది. అయితే మళ్లీ ప్రాజెక్ట్ సెట్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను గల్లా జయదేవ్ నిర్మిస్తాడని తెలుస్తుంది. అయితే సినిమాకు సంబంధించిన కథను కాణిపాక వరసిద్ధుని సమక్షంలో ఉంచి పూజలు నిర్వహించారు.

శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా ఘనవిజయం సాధించాలని అశోక్‌తో పాటు ఆయన కుటుంబీకులు మ‌రియు చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తదితరులు కోరుకున్నారు. అంతకుముందు తవణంపల్లె మండలం దిగువమాఘంలోని రాజన్న పార్కులో గల్లా అశోక్‌ తన ముత్తాత,పార్లమెంటు మాజీ సభ్యుడైన పాటూరు రాజగోపాల నాయుడికి కుటుంబసభ్యులతో కలసి నివాళులర్పించారు. చిత్ర కథను ఆయన పాదాల వద్ద ఉంచి సక్సెస్‌ కావాలని కోరుకున్నారు.