గెటప్ శ్రీను ముదురు గురూ!హీరోయిన్ తో లిప్ లాక్ ..!!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. వీరిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. శ్రీను ను బుల్లి తెర కమల్ హాసన్ గా పిలుచుకుంటారు. ఎందుకంటే శ్రీను వేసిన వేషాలు మరియు స్టైల్ ఆఫ్ యాక్షన్ ఎవరికి రాదు మరి.

ఇక గెటప్ శ్రీను కు సినిమా అవకాశాలు కూడా విరివిగా లభిస్తున్నాయి. రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమా లో కూడా నటించి మెప్పించాడు. ఇక తన క్లోజ్ ఫ్రెండ్ సుధీర్ లాగానే తాను కూడా హీరోగా తన అదృష్టం పరీక్షించు కుంటున్నాడు. తాను హీరోగా సాయి వరుణవి క్రియేషన్స్ బ్యా నర్ పై రూపొందుతున్న చిత్రం “రాజుయాదవ్ . కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ని సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదల చేశారు.

టీజర్ కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్ లో ఇంట్రస్టింగ్ గా ఉంది టీజర్ లో గెటప్ శ్రీను నటన బాగుంది. ఎన్ని బాధలు ఉన్నా కూడా జీవితం లో ఎలా బతకాలి అనే పాయింట్ మీద సినిమా ఉండి  చాలా ఆసక్తికరంగా ఉంది. హీరోయిన్ అకింత ఖరత్ గ్లామర్ విందులు పంచుతోంది. ఇక ఈ సినిమా లో గెటప్ శ్రీను హీరోయిన్ తో లిప్ లాక్ లాగించాడు. ప్రస్తుతం ఈ లిప్ లాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చూడాలి మరి ఈ సినిమా గెటప్ శ్రీను కు మంచి రెస్పాన్స్ తెచ్చి పెడుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news