షూటింగ్ లో గోపిచంద్ కు గాయాలు..!

-

కొన్నాళ్లు మాస్ ఆడియెన్స్ ను అలరించే సినిమాలతో హిట్లు అందుకున్న గోపిచంద్ ఈమధ్య హిట్ కొట్టడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. లౌఖ్యం తర్వాత గోపిచంద్ కెరియర్ చాలా డల్ గా మారింది. ప్రస్తుతం తిరు డైరక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న గోపిచంద్ ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతుంది. అయితే ఈరోజు బైక్ పై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా గోపిచంద్ కు బైక్ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది.

బైక్ స్కిడ్ అవడం వల్ల గోపిచంద్ కింద పడ్డారట. అయితే వెంటనే షూటింగ్ ఆపేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు ఆయన్ను తీసుకెళ్లారట. చిన్నపాటి గాయాలతో బయట పడ్డాడు గోపిచంద్. అయితే రిస్కీ షాట్స్ తీసేప్పుడు సాధారణంగా హీరోలు డూప్ లను వాడుతుంటారు కాని ఈమధ్య స్టార్స్ రిస్క్ తీసుకుని డూప్ లేకుండా చేస్తున్నారు. గోపిచంద్ యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ కంగారు పడగా చిన్న గాయాలే తగిలాయని చిత్రయూనిట్ చెప్పడంతో కూల్ అయ్యారు. ఈ సినిమాలో గోపిచంద్ సరసన తమన్నా ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news