గోపీచంద్ “విశ్వం” టీజర్ రిలీజ్!

-

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వం. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ 32 గా వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరికెక్కుతున్న ఈ సినిమాని చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఆకట్టుకునేలా ఉండడంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీను వైట్ల మార్క్ హాస్యం, యాక్షన్ మేలవింపుగా ఈ సినిమా రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.

ఇక గోపీచంద్ తన కామెడీ, యాక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. “మీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా”.. అంటే “నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మరే ఆర్ట్స్ తెలియదు” లాంటి కామెడీ డైలాగులు బాగా పేలాయి. ఈ మూవీని అక్టోబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news